మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే జేఎల్‌ఎం పోస్టుల భర్తీ

Telangana JLM Posts Job Notification Soon CPDCL - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనివార్య కారణాల వల్ల వాయి­దా పడిన జేఎల్‌ఎం పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలోనే చేపడతామని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్‌) సీఎండీ రఘుమారెడ్డి ప్రక­టించారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామని స్పష్టం చేశారు. కార్పొరేట్‌ కార్యా­లయంలో సీపీడీసీఎల్‌ సాధించిన వార్షిక ప్రగ­తిని శుక్రవారం మీడియాకు వివరించారు.

నీరు, విద్యుత్‌లను వృథా చేయకూడదని, పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గతేడాది డిసెంబర్‌ 30న రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ 10,724 మెగవాట్లు ఉండగా, శుక్రవారం రికార్డు స్థాయిలో 14,107 మెగా­వాట్లు నమోదైందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గతేడాది మార్చిలో 3,435 మెగావాట్లు నమోదైంది. 2023 మార్చి నాటికి 4,000 మెగా­వాట్లు దాటే అవకాశం ఉందని చెప్పారు.

కొంత­మంది రైతులు తమ మోటార్లకు ఆటోమెటిక్‌ స్టాట­ర్లు బిగించి అవసరం లేకపోయినా విద్యుత్‌ సహా నీటిని వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వృథాను అరికట్టడం వల్ల లోటునే కాకుండా విద్యుత్‌ నష్టాలను అధిగమించొచ్చన్నారు.
చదవండి: గ్రూప్‌–3లో 1,365 కొలువులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top