గ్రూప్‌–3లో 1,365 కొలువులు 

Telangana: Notification issued for Group 3 Jobs - Sakshi

టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల  

జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తుల స్వీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్‌–3 కేడర్‌కు సంబంధించిన ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడింది. 26 ప్రభుత్వ విభాగాల్లో 1,365 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది. నెలపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తూ ఫిబ్రవరి 23ను గడువుగా నిర్దేశించింది.

ప్రస్తుతం వెబ్‌నోట్‌ ద్వారా గ్రూప్‌–3 ఖాళీల వివరాలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ... జనవరి 24న పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. తాజాగా జారీ చేసిన ప్రకటన ప్రకారం మొత్తం 1,365 ఉద్యోగ ఖాళీలుండగా... ఇందులో సగానికిపైగా ఆర్థిక శాఖలకు సంబంధించిన ఉద్యోగాలే ఉన్నా యి. డిసెంబర్‌ ఒకటిన గ్రూప్‌–4 ప్రకటన జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ వరుసగా నెలాఖరు నాటికి గ్రూప్‌–2, గ్రూప్‌–3 ప్రకటనలు జారీ చేసి రికార్డు సృష్టించింది. 

కొత్త కేడర్ల చేరికతో... 
రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగాలకు గ్రూప్‌–2, గ్రూప్‌–3 హోదా ఇచ్చింది. ఈ క్రమంలో పలు కేడర్‌లు గ్రూప్‌–2, గ్రూప్‌–3లోకి చేరడంతో పోస్టుల సంఖ్య కూడా పెరిగింది. గ్రూప్‌–3 కేటగిరీలో భర్తీకానున్న పోస్టుల్లో సీనియర్‌ అకౌంటెంట్, అసిస్టెంట్‌ ఆడిటర్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులున్నాయి. అత్యధికంగా ఆర్థికశాఖ పరిధిలో 712 పోస్టు లుండగా అందులో పే అండ్‌ అకౌంట్స్‌ హెచ్‌ఓడీలో 126 సీనియర్‌ అకౌంటెంట్, ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ హెచ్‌ఓడీలో 140, ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ (జోనల్‌) హెచ్‌ఓడీలో 248, స్టేట్‌ ఆడిట్‌ హెచ్‌ఓడీలో 61 సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులున్నాయి.  

గ్రూప్‌-3 జాబ్‌ కోసం ప్రిపేర్‌  అవుతున్నారా? మీకోసం సాక్షి ఎడ్యుకేషన్‌.. క్లిక్‌ చేయండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top