ఆ ఖర్చంతా మార్గదర్శి భరించాల్సిందే: హైకోర్టు | Telangana High Court Hearing On Margadarsi Case | Sakshi
Sakshi News home page

ఆ ఖర్చంతా మార్గదర్శి భరించాల్సిందే: హైకోర్టు

Sep 5 2024 12:14 PM | Updated on Sep 5 2024 7:17 PM

Telangana High Court Hearing On Margadarsi Case

నోటీసులు యాడ్స్‌కు అయ్యే ఖర్చును మార్గదర్శి భరించాలని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది.

సాక్షి, హైదరాబాద్‌: ‘మార్గదర్శి’ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నోటీసులు యాడ్స్‌కు అయ్యే ఖర్చును మార్గదర్శి భరించాలని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. యాడ్స్ ఖర్చు వివరాలు ఇచ్చిన వారంలోపు మార్గదర్శి డిపాజిట్‌ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. 

‘‘చందాదారుల వివరాల కోసం పత్రికల్లో నోటీసులివ్వండి. మొత్తం ఎంత ఖర్చవుతుందో రిజిస్ట్రీ మార్గదర్శికి చెబుతుంది. అప్పటి నుంచి వారంలోగా ఆ డబ్బు డిపాజిట్‌ చేయాలి. వెంటనే పత్రికల్లో విస్తృతంగా నోటీసులిస్తూ ప్రచారం చేయండి’’ అని  ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 30కి కోర్టు వాయిదా వేసింది.

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదును తిరిగి చెల్లించిందా? లేక ఎవరికైనా ఎగవేసిందా..? అనే వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు గత విచారణలో రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది.

అలాగే చందాదారుల వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్‌ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సూచించింది. అఫిడవిట్‌ ఆధారంగా తాము మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే.


 

 

 

Advertisement
 
Advertisement
Advertisement