
బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. ఇప్పటికే జంతూ వధ చట్టం అమలు చేస్తున్నామని ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది.
మూడు కమిషనరేట్‌ల పరిధిలో 150 చెక్ పోస్ట్‌లు పెట్టామని కోర్టుకు పోలీసులు తెలిపారు. ఇప్పటికే గోవుల తరలింపుపై 60 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.