ఆడబిడ్డ పుడితే ఆ ఊరంతా సంబురమే!

Telangana: Haridaspur Village In Turns Birth Of Girls Into A Celebration - Sakshi

ఆడపిల్లలు పుట్టడమే దురదృష్టం అనుకుంటూ గర్భంలోనే శిశువులను చంపుతున్న రోజులివి. సమాజంలో లింగ వివక్ష వేళ్లూనుకుపోయింది. ఆడబిడ్డలని తెలిసి.. వారిని గర్భంలోనే చిదిమేసే వారు కొందరైతే.. పుట్టిన తర్వాత పెంట కుప్పల్లో.. నదుల్లో.. విసిరేసే వారు మరికొందరు. ఇక  పల్లెల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. ఆడపిల్ల అంటే మన ఇంటి పిల్ల కాదని.. మగ పిల్లవాడిని కంటే వాడు వృద్దాప్యంలో తోడుంటాడని చాలా మంది అనుకుంటారు. విద్య, అధునాతన సదుపాయాలు పెరిగినా.. ఆ వివక్ష పోవడం లేదు.  బేటి బచావో లాంటి కార్యక్రమాలు ఎన్ని వస్తున్నా.. ఆచరణలో అవి అంతంత మాత్రమే అమలవుతున్నాయి. ఆడపిల్లపై ఇంత వివక్షత ఎదురవుతున్న ఈ తరణంలో ఆడపిల్లలు పుడితే కంటి కద్దుకుంటున్నారు ఓ గ్రామస్తులు.  వారి పుట్టుకను ఒక పండుగల జరుపుతున్నారు. అదెక్కడో కాదు.. మన తెలంగాణలోనే.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన నగరమైన సంగారెడ్డి (ప్రస్తుతం ఇది జిల్లా కేంద్రం) జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్పుర్ గ్రామంలో ఆడపిల్ల పుడితే ఊరు ఊరంతా పండుగలా జరపుకుంటున్నారు. ఈ పద్దతి గతేడాది నుంచే ప్రారంభమైంది. 1 జనవరి 2020లో మొదలవ్వగా అప్పటి నుంచి ఊరిలో ఎవరి ఇంట్లోనైనా ఆడపిల్ల జన్మిస్తే.. ఊరంతా లైట్స్ ఏర్పాట్లు చేసి.. దుస్తులు, స్వీట్స్ పంచుకుంటారు. పుట్టిన పాప పేరు మీద రూ. 1,000 ల చెక్కు అందజేస్తారు ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్. సుకన్య సమృద్ధి పథకం కింద వెయ్యి రూపాయల జమ చేస్తున్నారు గ్రామస్తులు.  10 ఏళ్లలోపు ఉన్న ఇద్దరు కూతుర్ల పేరుపై సుకన్య సమృద్ధి అంకౌంట్లను ప్రారంభించారు  ఆడపిల్లలను కడుపులోనే చంపేస్తున్న వారికి ఈ ఊరు ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top