బీజేపీ జాతీయ సభ.. షెఫ్‌లకు యాదమ్మ ‘వంటల’ పాఠాలు!

Telangana Cooking Specialist Yadamma Advice Recipes Novotel-HICC Chefs - Sakshi

తెలంగాణ ప్రత్యేక రుచులు, వండే తీరు, కావాల్సిన సామగ్రిపై శిక్షణ

సాక్షి, హైదరాబాద్‌: ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ప్రధాన షెఫ్‌లు, వారి సహాయకులు తెలంగాణ వంటకాల పాఠాలు నేర్చుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆదివారం ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలను వడ్డించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో ఫుడ్‌ కమిటీ ఇన్‌చార్జీ, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, ఇతర నేతలు బుధవారం వంట ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా యాదమ్మ చేయబోయే వంటకాల జాబితాను సిద్ధం చేశారు. ఆయా వంటకాలు, కావాల్సిన సామగ్రి గురించి నోవాటెల్‌–హెచ్‌ఐసీసీ షెఫ్‌లు కరీంనగర్‌కు చెందిన తెలంగాణ వంటల నిపుణురాలు యాదమ్మ నుంచి వివరాలు తెలుసుకున్నారు. సభ కోసం సర్వపిండి, ముద్ద పప్పు, పచ్చి పులుసు, గంగవాయిలి పప్పు, భక్ష్యాలు, పల్ల పులుసు, మక్క గారెలు, ఉల్లి పకోడి, పంట గారెలు, బెల్లం పరమాన్నం, సేమియా పాయసంతోపాటు మరికొన్ని రకాల వంటలను సిద్ధం చేయనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top