వేంకటేశ్వరాలయంలో సీఎం సతీమణి పూజలు | Telangana CM KCR Wife Pooja In Venkateswara Swamy Temple | Sakshi
Sakshi News home page

వేంకటేశ్వరాలయంలో సీఎం సతీమణి పూజలు

Jan 3 2023 1:40 AM | Updated on Jan 3 2023 8:32 AM

Telangana CM KCR Wife Pooja In Venkateswara Swamy Temple - Sakshi

వేంకటేశ్వర కాలనీ: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ సోమవారం శ్రీనగర్‌ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమెకు వేద ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో లావణ్య, స్థానిక కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement