రేపు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. ఎన్నికల షెడ్యూల్‌పై చర్చ! | Telangana Cabinet Meeting On June 16th | Sakshi
Sakshi News home page

రేపు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. ఎన్నికల షెడ్యూల్‌పై చర్చ!

Jun 15 2025 12:44 PM | Updated on Jun 15 2025 1:02 PM

Telangana Cabinet Meeting On June 16th

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్ సోమవారం(రేపు) మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం కానుంది.‍ కేబినెట్‌ సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో, ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మొదలైంది.

మరోవైపు.. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. సోమవారం నిర్వహించే క్యాబినెట్‌ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే గడువుందని.. కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధం కావాలని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement