‘ప్రత్యేక నిధి’కి భారీగా.. | Telangana budget allocates Rs 57400 crore for special development of SC and ST | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక నిధి’కి భారీగా..

Mar 20 2025 4:37 AM | Updated on Mar 20 2025 4:37 AM

Telangana budget allocates Rs 57400 crore for special development of SC and ST

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధికి రూ.57,400 కోట్లు

ఇందులోఎస్సీ ఎస్‌డీఎఫ్‌కు రూ.40,231.61 కోట్లు, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌కు రూ.17,168.82 కోట్లు 

గత కేటాయింపుల కంటే రూ.7,220 కోట్లు అదనం 

సాక్షి, హైదరాబాద్‌ :  దళిత, గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి ఈసారి భారీగా పెరిగింది. 2025–26 వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ కింద రూ.57,400.43 కోట్లు కేటాయించింది. గత వార్షిక బడ్జెట్‌లో ఎస్‌డీఎఫ్‌ కింద 50,180.13 కోట్లు కేటాయింపులు జరపగా... ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వం రూ.7,220.30 కోట్లు అదనంగా కేటాయింపులు చేసింది. 

ఇందులో షెడ్యూల్డ్‌ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్‌డీఎఫ్‌) కింద రూ.40,231.61 కోట్లు కేటాయించగా, గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్‌డీఎఫ్‌) కింద రూ.17,168.82 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల్లోనూ ఎస్సీ ఎస్‌డీఎఫ్‌కు అధిక ప్రాధాన్యం దక్కింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఎస్సీ ఎస్‌డీఎఫ్‌ కింద రూ.7,107.57 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి. ఎస్టీ ఎస్‌డీఎఫ్‌కు మాత్రం 112.73 కోట్లు మాత్రమే పెరిగాయి.  

‍పరిశ్రమలకు రూ.3,527 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు.. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.1,730 కోట్లు
» ప్రగతి పద్దు కింద 2024–25 వార్షిక బడ్జెట్‌లో పరిశ్రమల శాఖకు 2,248.13 కోట్లు కేటాయించి, తర్వాత రూ.1,321.57 కోట్లకు సవరించారు. తాజా బడ్జెట్‌లో పరిశ్రమల శాఖకు ప్రగతిపద్దు కింద రూ.2,383.42 కోట్లు ప్రతిపాదించారు. 
»   పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీల బకాయిలు రూ.4,236 కోట్ల మేర పేరుకుపోయిన నేప థ్యంలో ప్రస్తుత బడ్జెట్‌లో వీటికి రూ.1,730 కోట్లు కేటాయించారు. 
»   టీ హబ్‌ ఫౌండేషన్‌కు గత ఏడాది బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో నయాపైసా ఇవ్వలేదు. 
»   ఐటీ శాఖకు 2024–25 బడ్జెట్‌లో ప్రగతిపద్దు కింద రూ.771.20 కోట్లు ప్రతిపాదించి, చివరకు 337.30 కోట్లకు సవరించారు. తాజా బడ్జెట్‌లోనూ ప్రగతిపద్దు కింద ఈ శాఖకు రూ.771.20 కోట్లు ప్రతిపాదించారు.
»  కొత్త పారిశ్రామిక పార్కుల్లోని ప్లాట్లలో 5 శాతం మహిళా పారిశ్రామికవేత్తలకు, 15 శాతం ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తారు.


»   ప్రైవేటు ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు స్టాంప్‌ డ్యూటీ, విద్యుత్‌ చార్జీలు, భూమి ధరల్లో రాయితీలు ఇస్తామని ప్రకటించారు.
»  2050 నాటికి రాష్ట్రమంతటా పారిశ్రామిక అభివృద్ధి కోసం ‘మెగా మాస్టర్‌ప్లాన్‌ 2050’ పాలసీ తెస్తామని ప్రభుత్వం తెలిపింది.
»   పాలసీలో భాగంగా ఐటీ, ఫార్మా, హెల్త్, ఫుడ్‌ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, మెటల్, చేనేత, ఆభరణాల తయారీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు.
»   జాతీయ రహదారి 163కు ఇరువైపులా హైదరాబాద్‌– వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటును ప్రతిపాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement