70 మంది బీసీలను అసెంబ్లీకి పంపడమే లక్ష్యం: ఆర్‌ఎస్‌పీ

వేంసూరు: వచ్చే ఎన్నికల్లో 70 మంది బీసీలను ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పంపడమే బీఎస్పీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లా వేంసూరు, సత్తుపల్లి మండలాల్లో కొనసాగిన యాత్రలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ... వడ్డించేవాడు బహుజనుడైతేనే అందరి ఆకలి తీరు తుందన్నారు.
అందుకు వచ్చే ఎన్నికల్లో 70 మంది బీసీ ప్రతినిధులను అసెంబ్లీకి పంపించేందుకు ప్రతి బహుజన బిడ్డ పనిచేయా లని కోరారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నేడు నాలుగు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. పనికి రాని పథకాలతో ప్రజలను మోసం చేస్తున్నారని, పేదలకు ఉచిత విద్య, వైద్యం అంది స్తే ఉచిత పథకాలతో పనేమిటని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించా రు. దళితబంధు పథకంతో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులకే లబ్ధి జరిగేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల హక్కుల కోసం కాపలాగా ఉంటానని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు.