50 రోజులు.. 5 వేల కిలోమీటర్లు    | Telangana: Austrian Engineer Cycle Trip Reached Yadagirigutta | Sakshi
Sakshi News home page

50 రోజులు.. 5 వేల కిలోమీటర్లు   

Nov 29 2022 1:46 AM | Updated on Nov 29 2022 2:51 PM

Telangana: Austrian Engineer Cycle Trip Reached Yadagirigutta - Sakshi

బోధనందగిరి ఆశ్రమంలో హెన్స్‌పీటర్‌  

యాదగిరిగుట్ట: ఆస్ట్రియా దేశానికి చెందిన ఇంజినీర్‌ హెన్స్‌పీటర్‌ ఢిల్లీ నుంచి యాదాద్రి వరకు చేపట్టిన సైకిల్‌యాత్ర ఆదివారం యాదగిరిగుట్ట పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా హెన్స్‌పీటర్‌ శ్రీభోదనందగిరి గో ఆశ్రమ పీఠాధిపతి బోదనందగిరి స్వామిజీని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వంటలు అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు.

వివిధ ప్రాంతాల ప్రజలను కలిసి వారిగురించి తెలుసుకునేందుకు ఆస్ట్రియా నుంచి సైకిల్‌ యాత్ర చేపట్టానని వివరించారు. పాకిస్తాన్‌ సరిహద్దు దగ్గర పరిస్థితులు అనుకూలించకపోవడంతో విమానంలో దుబాయ్‌ చేరుకొని, అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చినట్లు వెల్లడించారు. ఢిల్లీ నుంచి యాదాద్రికి తిరిగి సైకిల్‌ యాత్ర ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 50 రోజుల్లో 5 వేల కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించినట్లు వివరించారు. యాదాద్రి క్షేత్రాన్ని మంగళవారం సందర్శించనున్నట్టు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement