చివరి ఓసీ సీఎం రేవంత్‌రెడ్డి | Teenmar Mallanna Mass Speech At BC Yudha Bheri Sabha | Sakshi
Sakshi News home page

చివరి ఓసీ సీఎం రేవంత్‌రెడ్డి

Feb 3 2025 6:16 AM | Updated on Feb 3 2025 6:16 AM

Teenmar Mallanna Mass Speech At BC Yudha Bheri Sabha

ఆర్ట్స్‌ కాలేజీ యుద్ధభేరి సభలో తీన్మార్‌ మల్లన్న  

హనుమకొండ చౌరస్తా: తెలంగాణలో చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. 2028లో బీసీ వ్యక్తి సీఎం కావడం పక్కా.. అని తీన్మార్‌ మల్లన్న అన్నారు. హనుమ కొండలోని యూని వర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ఆదివారం బీసీ రాజకీయ యుద్ధభేరి సభ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి మల్లన్న ప్రసంగించారు. కుల గణనలో రెడ్లు, వెలమల శాతం ఎంతో చెప్పే ధైర్యం ప్రభుత్వాలకు లేదని అన్నారు.

55 శాతం ఉన్న బీసీలు ఏడాదికి లక్షా 20 వేల కోట్ల పన్నులు చెల్లిస్తుంటే.. ఆ కుప్పపై రెడ్లు, వెలమలు కూర్చుని కాంట్రాక్ట్‌లు చేసుకుంటూ సొంత ఖజానా నింపుకుంటున్నారని విమర్శించారు. ఈ సభ రెడ్లు, వెలమలకు–బీసీలకు మధ్య జరిగిన విడాకుల సభ అని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీసీలు ఎవరైనా బీసీ అభ్యర్థులకే ఓటేయాలని మల్లన్న కోరారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీపీమండల్‌ మనవడు సూరజ్‌ మండల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement