మిస్‌ నాటా 2020 రన్నరప్‌గా తారిక 

Tarika Yellaula Was The First Runner Up In Miss Nata 2020 - Sakshi

సాక్షి, లక్డీకాపూల్‌: మిస్‌ నాటా 2020 ప్రథమ రన్నరప్‌గా ప్రవాస భారతీయురాలు తారిక యెల్లౌలా నిలిచారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ సినీనటి ప్రియమణి, యాంకర్‌ శ్యామలు వ్యవహరించారు. అమెరికాలోని నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌(నాటా) ఎంతో మంది ప్రతిభావంతులను, కొత్త వారిని ప్రోత్సహించే క్రమంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఈ క్రమంలో నాటా ప్రపంచ స్థాయి మిస్‌ నాటా పోటీలను నిర్వహించింది. ప్రత్యేకంగా తెలుగు వారి కోసం ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో అమెరికాలోని న్యూజెర్సీలో నివాసముంటున్న పదహారేళ్ల తారక యెల్లౌలా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. (పులికి, గద్దకు పురస్కారం! )

మిస్‌ నాటా 2020 రన్నరప్‌గా నిలిచిన ఆమె తన చదువును కొనసాగిస్తూనే నటనను, నృత్యాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులు వెంకట్, రోజా, గురువు మాళిని అయ్యర్‌ ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొంటున్నారు. చిన్నప్పటి నుంచే నాట్యం, అభినయం వంటి కళల్లో శిక్షణ తీసుకుంటూ తన సోదరి తాన్వికతో కలిసి ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో నటనతో పాటు నృత్యాన్ని కొనసాగిస్తానని ఆమె వివరించారు. (శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు జాతీయ అవార్డులు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top