సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఈనెల 27కు విచారణ వాయిదా

Supreme Court Hearing On BRS MLA Poaching Case - Sakshi

న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడా ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరుపున సీనియర్‌ అడ్వకేట్‌ దుష్యంత్‌ దవే పలు కీలక అంశాలను ధర్మాసనం ముందు వినిపించారు. 

సీబీఐ, ఈడీ  మీడియాకు లీకులు ఇస్తున్నాయిని తెలిపారు. ఈ కేసులో సీబీఐ ఒత్తిడి చేయకుండా ఆర్డర్‌ ఇవ్వాలని కోరారు. సిట్‌ దర్యాప్తులోని ఆధారాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని.. ఈ క్రమంలో కేసు విచారణను సీబీఐకి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. కేసుపై వాదనల కోసం తనకు ఎక్కువ సమయం కావాలని కోరారు. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 

రాగా ఎమ్మెల్యేల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీచేస్తూ  ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.  సిట్‌ దర్యాప్తు రద్దుచేస్తూ.. కేసుకు  సంబంధించిన  రికార్డులన్నీ సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సీబీఐ దర్యాప్తు జరపాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని తెలంగాణ సర్కార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 
చదవండి: హైదరాబాద్‌ సీ‘రియల్‌’ స్నాచర్ల కేసులో కీలక మలుపు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top