అండగా నిలిచిన తోటి ‍బ్యాచ్‌ మిత్రులు

Sultan Bazar CI Laxman: SI 2009 Batch Helps To Laxman Family - Sakshi

రూ.39.5 లక్షలు అందజేసిన తోటి ఎస్సైలు

సాక్షి, హైదరాబాద్‌: 2009 బ్యాచ్‌ ఎస్సైలు మరోసారి తమ పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన తమ బ్యాచ్‌మేట్‌ కుటుంబానికి చేయూతనందించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని సుల్తాన్‌బజార్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.లక్ష్మణ్‌ ఇటీవల నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లక్ష్మణ్‌ దంపతులిద్దరూ కన్నుమూశారు.

లక్ష్మణ్‌ మృతితో ఆంధ్ర– తెలంగాణలో పనిచేస్తున్న అతని 2009 బ్యాచ్‌కి చెందిన 1,100 మంది పోలీసు అధికారులు స్పందించి రూ.35 లక్షలు పోగుచేశారు. గురువారం లక్ష్మణ్‌ దినకర్మలో అతని పిల్లలు ఆకాంక్ష, సహశ్‌కు ఆ డబ్బును అందజేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో పనిచేస్తున్న 2012 బ్యాచ్‌ ఎస్సైలు కూడా క్రిష్ణయ్య నేతృత్వంలో తమ వంతుగా రూ.4.5 లక్షలు సహాయం అందించారు. కార్యక్రమంలో 2009 బ్యాచ్‌ సొసైటీ సభ్యులు జి.శ్రీనివాస్, బి.ప్రమోద్, ఎస్కే లతీఫ్, బగ్గని శ్రీనివాస్, మందల రాజు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top