భారీ వర్షం.. హైదరాబాద్‌లో నేడు స్కూళ్లకు సెలవు | School Holidays Due To Heavy Rains In Hyderabad | Sakshi
Sakshi News home page

భారీ వర్షం.. హైదరాబాద్‌లో నేడు స్కూళ్లకు సెలవు

Sep 5 2023 8:32 AM | Updated on Sep 5 2023 10:06 AM

School Holidays Due To Heavy Rains In Hyderabad - Sakshi

భారీవర్షాల కారణంగా హైదరాబాద్‌లో స్కూళ్లకు కలెక్టర్‌ సెలవు ప్రకటించారు.

సాక్షి, హైదరాబాద్‌: భారీవర్షాల కారణంగా హైదరాబాద్‌లో స్కూళ్లకు కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. పొరుగున్న ఉన్న మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పాఠశాలలకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో హైదరాబాద్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగిపోర్లుతున్నాయి. రోడ్లపై పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ.

మరో మూడు గంటల పాటు భారీ వర్షం కొనసాగవచ్చని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో  డీఆర్‌ఎఫ్‌ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది.  అత్యవసరమైతేనే బయటకు రావాలని నగర వాసులను అధికారులు సూచించారు.
చదవండి: హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌ జారీ..

Advertisement
 
Advertisement
Advertisement