మాస్కు లేకుండా మాజీ ఎమ్మెల్యే తీగల, రూ.1000 ఫైన్‌ | Saroornagar Police Fined To Teegala Krishnareddy For Without Mask | Sakshi
Sakshi News home page

మాస్కు లేకుండా మాజీ ఎమ్మెల్యే తీగల, రూ.1000 ఫైన్‌ వేసిన పోలీసులు

May 11 2021 1:27 PM | Updated on May 11 2021 2:03 PM

Saroornagar Police Fined To Teegala Krishnareddy For Without Mask - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ శాసన సభ్యులు, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డికి సరూర్‌నగర్‌ పోలీసులు చలానా విధించారు. కారులో మాస్క్‌ లేకుండా వెళుతున్న తీగల కృష్ణారెడ్డికి పోలీసులు 1000 రూపాయల చలానా వేశారు. కర్మన్‌ఘాట్ చౌరస్తా వద్ద సరూర్‌నగర్‌ పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. అదేసమయంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన కారులో వెళ్తున్నారు. పోలీసులు ఆయన కారును తనిఖీ చేశారు.

ఆ సమయంలో తీగల కృష్ణారెడ్డి మాస్క్ ధరించలేదు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని సరూర్‌నగర్‌ సబ్ ఇన్‌స్పెక్టర్ ముకేష్.. మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. కారులో వెళ్తున్నా మాస్కు ధరించాలా? అంటూ ఆయన ఎస్‌ఐతో  గొడవకు దిగారు. ఈ క్రమంలో సబ్‌ఇన్‌స్పెక్టర్ ముకేశ్‌కు తీగల కృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది. మాకు అంతా సమానులే అంటూ పోలీసులు తీగలకు ఎట్టకేలకు 1000 రూపాయల చలానా విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement