తెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజు | Sanjay Jaju assumes charge as Telangana Chief Secretary | Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజు

Jun 30 2026 2:42 PM | Updated on Jun 30 2026 3:22 PM

Sanjay Jaju assumes charge as Telangana Chief Secretary

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజు ఈ రోజు ( మంగళవారం) బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా 2 గంటల 15 నిమిషాల సమయంలో  ముహూర్తం చూసుకొని సచివాలయంలోని ప్రధాన కార్యదర్శి సీటులో కూర్చున్నారు. మాజీ ‍ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాలం నేటితో ముగియడంతో ఆయన స్థానంలో సంజయ్‌ జాజు బాధ్యతలు స్వీకరించారు. 2029 ఫిబ్రవరి వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.    

సంజయ్ జాజు నేపథ్యం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు 1992 బ్యాచ్‌కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్, విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్‌గా, ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా రెండు తెలుగురాష్ట్రాలలో ఎంతో ప్రాముఖ్యత చెందిన మీ సేవ రూపకర్తలలో ఆయన ఒకరు. ఈ ప్రాజెక్టు రూపకల్పన, అమలులో ఆయన కీలక పాత్ర పోషించారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కేంద్ర సర్వీసుల్లో ఆయన డిప్యూటేషన్‌పై ఉన్నారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NHIDCL) డైరెక్టర్‌గా, కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అభ్యర్థన మేరకు రాష్ట్రానికి రప్పించి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement