దవాఖానాలకు ‘చికిత్స’ అవసరం

Republic Day Celebrations at Telangana Raj Bhavan - Sakshi

రాజ్‌భవన్‌ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్‌ తమిళిసై  

పనితీరు, మౌలిక సదుపాయాలు మెరుగుపడాలి

ఐటీ, ఫార్మాతోపాటు అనేక రంగాల్లో రాష్ట్రం దూకుడు

తెలంగాణ ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా మారిందని ప్రశంస

సాక్షి, హైదరాబాద్‌: ‘‘కరోనా మహమ్మారి ఎన్నో పాఠాలు నేర్పింది. మనకు గర్వకారణమైన ఉస్మా నియా ఆస్పత్రి సహా మన ప్రభుత్వ ఆస్ప త్రుల పనితీరు, మౌలిక సదుపాయాలను మెరుగు పర్చా ల్సిన అవసరముంది. ప్రధాని మోదీ దేశంలో ప్రతి జిల్లాకు ఓ వైద్య కళాశాలను మంజూరు చేశారు. తెలంగాణకు సైతం 8 వైద్య కళాశాలలు రాను న్నా యి. సామాన్యుల చివరి ఆశ అయిన ప్రభుత్వా స్పత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగుపర్చడం మన విధి’’ అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు. 73వ గణతంత్ర దినం సందర్భంగా బుధవారం రాజ్‌భవన్‌లో వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో ఉన్నతాధికారులు హాజరయ్యారు. గవర్నర్‌ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి  గౌరవవందనం స్వీకరించిన అనంతరం మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..

రాష్ట్రం అగ్రగామిగా ఎదగాలి: ‘‘తెలంగాణ అనేక రంగాల్లో దూసుకు పోతోంది. ఫార్మాహబ్, ఐటీ హబ్, మెడికల్‌ హబ్‌గా హైద రాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రం లో సమృద్ధిగా పంటలు పండుతు న్నాయి. రాష్ట్రం ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా అవతరించింది. రైతుల శ్రమకు వందనాలు. కోట్లాది మంది ప్రజ లకు ఆహార భద్రత కల్పించారు. నాణ్యమైన ఉన్నత విద్యలో రాష్ట్రం అగ్రగామిగా ఎదగాలి. కొత్త ఆవిష్క రణలను ప్రోత్సహించడం ద్వారా ఇన్నో వేషన్‌ హబ్‌గా స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి.  
నిజమైన చరిత్రను గుర్తించుకుంటున్నాం

ఇప్పటిదాకా గుర్తింపునకు నోచుకోని జాతీయవీరు లను తగిన రీతిలో గౌరవించుకోవడం ద్వారా దేశం తన నిజమైన చరిత్ర, వారసత్వాన్ని పునః కైవసం చేసుకుంటోంది. వలసవాద వార సత్వం స్థానంలో నిజమైన దేశభక్తి, జాతీయ వీరుల వారసత్వాన్ని నిలబెట్టేందుకు చరిత్రాత్మక ఇండియా గేట్‌ వద్ద నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని నెలకొల్పా లని (ప్రధాని మోదీ) నిర్ణయించడం దీనికి ఓ ఉదాహరణ. ఆత్మ నిర్భర్‌ భారత్‌ స్ఫూర్తితో అనేక రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  కోవిడ్‌ వ్యాక్సిన్ల అభివృద్ధి, ఉత్పత్తి, ఉచిత పంపిణీ దీనికి నిదర్శనం.   అంతర్గతంగా, సరిహద్దుల్లో అనేక సవాళ్లను దేశం విజయవంతంగా ఎదు ర్కొంటోంది. రక్షణ వ్యవస్థల నిరంతర ఆధునీ కరణతో దేశభద్రత పటిష్టమైంది. కరోనా,  అడ్డంకు లను అధిగమించి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది.

ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం
అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందాల్సి ఉంది. అణగారిన వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి సమాన అవకాశాలు కల్పించాలి. రాజ్‌భవన్‌ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, భద్రాద్రి–కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోని గిరిజనుల పోషకాహార స్థితిని మెరుగు పరచడానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. స్వయం ఉపాధితో మహిళలను ఆర్థికంగా బలోపే తం చేసేందుకు కృషి చేస్తున్నాం.  జాతీయ విద్యా విధానం–2020ని ప్రోత్సహించడం,  ఉన్నత విద్యను బలోపేతానికి తీసుకున్న చర్యలు భవిష్య త్తులో సత్ఫలితాలు ఇస్తాయని భావిస్తున్నాం.’’

వేడుకలకు సీఎం, మంత్రుల గైర్హాజరు
రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు పాల్గొనలేదు. రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం మేరకు వేడుకలను నిరా డంబరంగా నిర్వహించినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. కాగా, కోవిడ్‌ నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని కేబినెట్‌లో నిర్ణయించారని, ఆ నేపథ్యంలోనే రాజ్‌భవన్‌ కార్యక్రమానికి పార్టీ ప్రముఖులు హాజరు కాలేదని టీఆర్‌ఎస్‌ వర్గాలతోపాటు అధికారులు  చెబుతున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో గత రెండేళ్లపాటు రాష్ట్రస్థాయి గణతంత్ర దిన వేడుకలను నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో నిర్వ హించగా.. మూడోవేవ్‌ నేపథ్యంలో ఈసారి రాజ్‌ భవన్‌కు మార్చారు. కార్యక్రమంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాజ్‌ భవన్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top