
హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర రూపంలో దాడి చేస్తుండగా ఇదే అవకాశంగా భావించి కొందరు దుండగులు కరోనా వ్యాక్సిన్‌ను అక్రమంగా విక్రయిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఒక్కో వ్యాక్సిన్ రూ.40 వేల నుంచి లక్షకు పైగా విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటుండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అక్రమంగా వ్యాక్సిన్ విక్రయిస్తున్న వారిని హైదరాబాద్ పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెమిడిసివీర్ ఇంజెక్షన్‌లు బ్లాక్‌లో అమ్ముతున్న ఆరుగురిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రెమిడిసివిర్ 6 ఇంజెక్షన్‌లు, నగదు రూ.5,52,000, ఒక యాక్టివా, 6 సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: మాస్క్ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్ డ్రైవర్