‘సింగరేణి’ సమస్యల పరిష్కారానికి రాజీనామాకు సిద్ధం

Ramagundam MLA Korukanti Chander About Singareni Contract Workers - Sakshi

సాక్షి, పెద్దపల్లి: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజీనామాకు సిద్ధమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. సింగరేణిలో 8 రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన జీఎం కార్యాలయం ముట్టడిలో చందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఎమ్మెల్యే పదవి గొప్పదేమీ కాదు. మీరందరూ మద్దతిస్తే గెలిచిన వ్యక్తిని. ఈ రోజు చెప్తే ఈ రోజే రాజీనామా చేసేవాడిని.

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే ఎమ్మెల్యే పదవిని అయినా త్యాగం చేస్తా. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి అండగా నిలబడతా’ అని ప్రకటించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు చట్టబద్ధమైనవని, ఈ ఉద్యమానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కార్మికులు విధుల్లోకి వెళ్లవద్దని చందర్‌ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపఎన్నికల ప్రభావం కొనసాగుతున్న సందర్భంలో ఎమ్మెల్యే రాజీనామా ప్రకటన నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top