Preeti Case: Senior Medical Student Saif In Police Custody - Sakshi
Sakshi News home page

ప్రీతి కేసు: పోలీస్‌ కస్టడీలో సీనియర్‌ మెడికో సైఫ్‌!

Feb 23 2023 8:16 PM | Updated on Feb 23 2023 8:59 PM

Preeti Case: Senior Medical Student Saif In Police Custody - Sakshi

వరంగల్‌:  వరంగల్‌ మెడికల్‌ కాలేజీ పీజీ స్టూడెంట్‌ ప్రీతి కేసుకు సంబంధించి సీనియర్‌ పీజీ వైద్య విద్యార్థి సైఫ్‌ ప్రస్తుతం పోలీస్‌ ‍కస్టడీలో ఉన్నాడు.  ప్రీతి కేసులో కీలకంగా పరిగణిస్తున్న సైప్‌ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని వేధించిన కేసులో సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు వేధింపుల కేసు నమోదు చేశారు మట్టేవాడ పోలీసులు. ఈ క్రమంలోనే ఎంజీఎం ఆసుపత్రిలోని అనస్తీషియా విభాగంలోని సీనియర్‌ వైద్యులను పోలీసులు విచారించారు. 

ఇదిలాఉంచితే, ప్రీతికి ఎక్మో సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్‌  వైద్యులు తెలిపారు. సీఆర్‌ఆర్‌పీ ద్వారా కిడ్నీ ఫంక్షన్‌ చేయిస్తున్నామని, ప్రీతి మల్టీ ఆర్గాన్స్‌ పూర్తిగా ఫెయిల్‌ అయ్యాయన్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్‌థితి అత్యంత విషమంగా ఉందని తాజా హెల్త్‌ బులెటన్‌లో వైద్యులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement