హైదరాబాద్‌కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. తిరిగి జర్మనీకి | Plane To Hyderabad Returns To Germany Due To Bomb Threat | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. తిరిగి జర్మనీకి

Jun 15 2025 9:51 PM | Updated on Jun 15 2025 9:56 PM

Plane To Hyderabad Returns To Germany Due To Bomb Threat

ఫైల్‌ఫోటో

హైదరాబాద్‌: మూడు రోజుల క్రితం జరిగిన అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటన తర్వాత ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రధానంగా ఎయిర్‌లైన్స్‌ నిర్వహణ సంస్థలకు ఆ విమాన ప్రమాదం మరింత అలజడి రాజేసింది. అదే సమయంలో విమానం మాటంటే ప్రజల్లో భయం కనిపిస్తోంది. ఇదిలా ఉంచితే,. తాజాగా జర్మనీ నుండి హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపుతో కలకలం రేగింది. 

దాంతో ఆ విమానం తిరిగి జర్మనీలోని ఫ్రాంకఫర్డ్‌ విమానాశ్రయానికి తిరిగి పయనమైంది. లుప్తాన్సా ఎయిర్‌ లైన్స్‌ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఉన్నపళంగా ఆ విమానాన్ని మార్గమధ్యంలోనే వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేశారు. లుప్తాన్సా LH 752 విమానానికి బాంబు బెదిరింపు నేపథ్యంలో తిరిగి మళ్లీ జర్మనీకి వెళ్లిపోయింది. అయితే  విమానం ఎక్కడ ఉండగా జరిగింది అనేది తెలియాల్సి ఉంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement