సాక్షి, వరంగల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్‌లోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో గల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు కాజ్‌వేల పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోవడంతో నిత్యావసరాలు, వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
చదవండి: 11 గంటల ఉత్కంఠకు తెర.. హమ్మయ్య! ఆ తొమ్మిది మంది సేఫ్

రామన్నగూడెం వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి

మత్తడి పోస్తున్న లక్నవరం సరస్సు

సరస్సులో నీటిపై తేలియాడుతున్నట్లుగా ఉన్న వంతెన

కొండాయివద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో రోడ్డు దాటి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలు

ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్న వాగు

కొత్తగూడ: తాడు సాయంతో కత్తెర్ల వాగు దాటుతున్న వేలుబెల్లి గ్రామస్తులు

వాజేడు: చింతూరుకు చెందిన మహిళ వైద్యం కోసం వెళ్తుండగా రోడ్డు దాటిస్తున్న యువకులు

కోతకు గురైన నర్సింగాపూర్–బోర్లగూడెం ప్రధాన రహదారి

కొత్తగూడెం: బూర్కపల్లి వాగు దాటుతున్న రామన్నగూడెం గ్రామస్తులు

వాజేడు: భువనపల్లి–లక్ష్మీపురం రోడ్డుపై ప్రవహిస్తున్న వరద

దొంగలగట్టు వాగు లోలెవల్ వంతెనపై ప్రవహిస్తున్న నది

మహాముత్తారం: గండికామారం రోడ్డుపై వరద ఉధృతి

కాటారం: గంగారం వద్ద వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వాగు

కోతకు గురైన నర్సింగాపూర్–మీనాజిపేట రహదారి

బూర్గుపేట–లక్ష్మీదేవిపేట మధ్య మారేడుగొండ చెరువు ఉధృతి

ఏటూరునాగారం: చెల్పాక రోడ్డుపై నాగులమ్మ ఒర్రె వరద


