డ్రోన్‌తో పురుగు మందుల పిచికారీ 

Pesticides Sprayed With Drones in Siddipet, Drones Advantages For Agriculture - Sakshi

మామూలుగా పంట చేనుకు రైతులు ఎరువులు, క్రిమిసంహారక మందులు చల్లుతారు. అయితే దీనికి అధిక సమయం తీసుకోవడమే గాక, కూలీలకు డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి రైతులు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి సూచించారు.


డ్రోన్‌తో ఎకరాకు కేవలం రూ.550 తోనే 6 నిమిషాల్లో మందుల పిచికారీ పూర్తవుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలో రంగధాంపల్లిలో ఉన్న తన పొలంలో డ్రోన్‌తో మందును పిచికారీ చేయించారు. జిల్లా రైతులంతా ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. 
– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top