ఢిల్లీలో ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభలు | National OBC Mahasabha On August 7 In Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభలు

Jul 29 2022 1:23 AM | Updated on Jul 29 2022 10:57 AM

National OBC Mahasabha On August 7 In Delhi - Sakshi

జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న గణేష్‌ చారి, శ్రీనివాస్‌గౌడ్‌  

కవాడిగూడ (హైదరాబాద్‌): బీసీలకు ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రాజకీయ రంగాల్లో జనాభా దామాషా పద్ధతిపై ప్రాతినిధ్యం దక్కాలని కోరుతూ ఆగస్టు 7న ఢిల్లీలో తల్కటోర స్టేడియంలో జాతీయ ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నట్లు కుల సంఘాల జేఏసీ చైర్మన్‌ కుందారం గణేష్‌చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌లు తెలిపారు.

మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో గురువారం వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement