breaking news
Ganesh chary
-
ఢిల్లీలో ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభలు
కవాడిగూడ (హైదరాబాద్): బీసీలకు ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రాజకీయ రంగాల్లో జనాభా దామాషా పద్ధతిపై ప్రాతినిధ్యం దక్కాలని కోరుతూ ఆగస్టు 7న ఢిల్లీలో తల్కటోర స్టేడియంలో జాతీయ ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నట్లు కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్‌చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌లు తెలిపారు. మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో గురువారం వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జానపద గాయకుడు గణేశ్‌చారి కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ జానపద గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు నీలం గణేశ్‌చారి(68) అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయన విద్యానగర్‌లోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. ‘చుట్టూ చుక్కలు చూడు.. నడుమ చంద్రున్ని చూడు.., కోడిపాయే లచ్చమ్మది.. కోడి పుంజుపాయే లచ్చమ్మది, రావు రావు సమ్మక్క.. రావే నా తల్లి సమ్మక్క.., జిల్లేలమ్మ జిట్టా’ వంటి ప్రఖ్యాతిగాంచిన జానపద గీతాలను గణేశ్‌చారి ఆలపించారు. ఆకాశవాణి, దూరదర్శన్‌ల్లో తెలంగాణ జానపదాన్ని వినిపించిన మొట్టమొదటి గాయకుడు ఆయనే. యాకత్‌పుర బ్రాహ్మణ వాడి నీలం నర్సింహ, బాలమ్మలకు గణేశ్‌చారి జన్మించారు. 1966లో ఆయన జానపదాలు పాడటం ప్రారంభించారు. అప్పటి నుంచి లాల్‌దర్వాజ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరల్లో జానపద గీతాలు ఆలపించేవారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన హెచ్ఎంటీ బేరింగ్స్‌లో ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ఆ సమయంలో జరిగిన పోలీసు కాల్పుల్లో గణేశ్‌చారి గాయపడ్డారు. ఆయనకు భార్య సుజాత, నలుగురు కుమారులు ఉన్నారు. కాగా, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు గణేశ్‌చారి భౌతికకాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.