దస్తూరీ.. మరవకండి..!

National Handwriting Day Special Story - Sakshi

చేతిరాతలో ముత్యాల్లాంటి అక్షరాలు

డీటీపీ రాకతో చేతిరాతపై తగ్గుతున్న ఆసక్తి

నేడు ‘నేషనల్‌ హ్యాండ్‌ రైటింగ్‌ డే’

కోల్‌సిటీ(రామగుండం): ‘అక్షరం మీద పట్టు.. జీవితానికి తొలిమెట్టు. చేతిరాతను బట్టి వారి సైకాలజీ తెలుసుకోవచ్చు’ అంటున్నారు గ్రాఫాలజిస్టులు. చిన్నప్పటి నుంచే పిల్లలు ముత్యాల్లాంటి అక్షరాలు రాయాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తుంటారు. లాక్‌డౌన్‌లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చేతిరాత మార్చడానికి ప్రత్నించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రతీ ఏడాది జనవరి 23న ‘నేషనల్‌ హ్యాండ్‌ రైటింగ్‌ డే’ జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

అందుబాటులో హ్యాండ్‌ రైటింగ్‌ బుక్స్‌..
ముత్యాల్లాంటి అక్షరాలు రాయడానికి మార్కెట్‌లో బోలెడు బుక్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులు హ్యాండ్‌ రైటింగ్‌లో నైపుణ్యం పొందేందుకు ఈ బుక్స్‌ దోహదపడుతున్నాయి. హ్యాండ్‌ రైటింగ్‌ మారడానికి హోంవర్స్‌ చేయాల్సిందే.

చేతిరాతే గీటురాయి..
విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి, తోటివారిలో ప్రత్యేక గుర్తింపు పొందడానికి చేతిరాతే గీటురాయి. మార్కులపై చేతిరాత ప్రభావం ఉంటుందని ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైందని నిపుణులు చెప్తున్నారు. ముత్యాలాంటి చేతిరాతను పేపర్‌ దిద్దేవాళ్లకు సులువుగా అర్థం అవుతుంది. దీంతో మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. చేతిరాత మార్పు కోసం ప్రత్యేకంగా సమ్మర్‌ కోచింగ్‌లు వెలుస్తుండటం విశేషం. 

11 రోజుల్లో ముత్యాల్లాంటి అక్షరాలు
చేతిరాత(గ్రాఫాలజీ)పై నేడు ప్రపంచ దేశాలు ప్రత్యేక దృష్టిసారించాయి. ఐదేళ్ల నుంచి 55 ఏళ్ల వయసు వారు కూడా చేతిరాత నేర్చుకోవచ్చు. ప్రతీ ఏడాది వేసవి సెలవుల్లో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు నిర్వహిస్తున్నాను. నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే 11 రోజుల్లో నేర్చుకోవచ్చు. అక్షర్‌ హ్యాండ్‌ రైటింగ్‌ మోటివేషన్‌ అకాడమీ అనే సంస్థను స్థాపించి పదేళ్లుగా చేతిరాతపై శిక్షణ ఇస్తున్నాను. ఉమ్మడి జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రల్లో కూడా చేతిరాతపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్న.          
– ఎండీ.మెరాజ్‌ అహ్మద్, చేతిరాత నిపుణులు–గోదావరిఖని
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top