గవర్నర్‌ తమిళిసై తీవ్ర వ్యాఖ్యల ఎఫెక్ట్‌.. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి షాక్‌!

National Commission For Women Notices To MLC Kaushik Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేసీఆర్‌ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను టార్గెట్‌ చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో, గవర్నర్‌ కూడా వారికి కౌంటర్‌ ఇచ్చారు. 

ఇదిలా ఉండగా.. గవర్నర్‌ తమిళిసై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన దగ్గర పెట్టుకున్నారని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదని ఆరోపణలు చేశారు. దీంతో, కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది.

కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను కమిషన్‌ సుమోటోగా తీసుకుని ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చింది. ఈనెల 21న కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. గవర్నర్‌పై కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల నిరసనలు తెలిపారు. 
 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top