కానిస్టేబుల్‌ హల్‌చల్‌.. విధుల్లో బూతుపురాణం..! | Nagar Kurnool: Police Constable Misbehaving With Youth | Sakshi
Sakshi News home page

హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేసిన సీఐ

Nov 17 2020 9:48 AM | Updated on Nov 17 2020 12:40 PM

Nagar Kurnool: Police Constable Misbehaving With Youth - Sakshi

యువకులను దూషిస్తున్న కానిస్టేబుల్‌ శివశంకర్‌   

సాక్షి. నాగర్‌కర్నూల్‌ క్రైం: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా ప్రజలకు చేరువ కావాలని రాష్ట్ర డీజీపీ సూచిస్తున్నప్పటికీ కొందరు పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల పోలీస్‌ శాఖకు చెడ్డపేరు వస్తోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ కొందరు యువకులను దుర్భాషలాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. ఆ వివరాలు.. దీపావళి పండుగ సందర్బంగా పట్టణంలోని రాంనగర్‌ కాలనీలో గల రామస్వామి ఆలయం ఎదుట బాణాలు కాల్చిన యువకులు అక్కడే కూర్చున్నారు. పెట్రోలింగ్‌ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు అటుగా వచ్చారు. అందులో ఒకరు శివశంకర్‌ వచ్చిరాగానే అక్కడున్న యువకులపై దూషణకు దిగాడు. అక్కడనుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. చదవండి: సీఐ సోమశేఖర్, హెడ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

యువకులు వెళ్తుండగానే ఇక్కడ కూర్చోవడానికి ఎవరు పర్మిషన్‌ ఇచ్చార్రా అంటూ బూతులు తిట్టాడు. దీంతో యువకులు ఏంతప్పు చేశామని దూషిస్తున్నారంటూ ప్రశ్నించారు. మరింత రెచ్చిపోయిన కానిస్టేబుల్‌ తనకు బీపీ లేపొద్దంటూ తిట్ల దండకానికి దిగాడు. అక్కడున్న వారిలో ఒకరు సెల్‌ఫోన్‌లో ఈతతంగాన్ని చిత్రీకరించి సోషల్‌మీడియాలో పెట్టారు. బీజేపీ నాగర్‌కర్నూల్‌ ఇన్‌చార్జ్‌ దిలీపాచారి, పలువురు ప్రజా సంఘాలు దీనిపై తీవ్రంగా స్పందించారు. కానిస్టేబుల్‌పై చర్య తీసుకోవాలంటూ అదే మాద్యమాల్లో డిమాండ్‌ చేశారు. అనుచిత ప్రవర్తన.. పోలీస్‌ సస్పెన్షన్‌  

విధుల నుంచి తొలగించాం  
యువకులతో అనుచితంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ శివశంకర్‌ను బ్లూకోల్ట్స్‌  విధుల నుంచి తప్పించామని సీఐ గాంధీనాయక్‌ తెలిపారు. జిల్లా హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేశామని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement