గని ప్రమాదంలో కళ్లు కోల్పోయిన కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Visiting Mine Accident Workers Who Lost Their Eyes - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియా­లోని కేటీకే 8వ గని ప్రమాదంలో గాయపడ్డ కార్మికుల్లో ఇద్దరు ఒక కంటి చూపు కోల్పో­యారు. గురువారం జరిగిన ప్రమాదంలో కార్మికులు చింతల రామకృష్ణ, బండి రాజశేఖర్, శ్రీనివాస్‌లు తీవ్రగాయాల­పాలవ్వడంతో హైదరాబాద్‌కు తరలించి వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

వారిలో రామకృష్ణ, రాజశేఖర్‌లకు ఒక్కో కన్ను పూర్తిగా దెబ్బతిన్నట్లు ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి వైద్యులు తెలిపినట్లు సింగరేణి అధికారులు చెప్పారు. కాగా ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు కార్మికులను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ­ణారెడ్డి శుక్రవారం పరామర్శించారు. కార్మికు­లకు మెరుగైన వైద్యం అందించి, కంటిచూపు వచ్చేలా చూడాలని వైద్యులను కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top