‘న్యాయం చేయమంటే.. ఎమ్మెల్యే పోలీసులకు పట్టించాడు’

MLA Anand Taken Farmer To The Police For Asking Him to Do Justice - Sakshi

రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయిన ఓ రైతు ఆవేదన

సాక్షి, వికారాబాద్ ‌: గతంలో ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేయమని అడిగిన పాపానికి ఎమ్మెల్యే ఆనంద్‌ తనను పోలీసులకు పట్టించాడని ఓ రైతు వాపోయాడు. బాధితుడి వివరాలు ఇలా ఉన్నాయి.. ‘మాది బంట్వారం మండలం బీరోల్‌. గ్రామ రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ పొలాల నుంచి గత ఏడాది ఫార్మేషన్‌ రోడ్డు నిర్మించారు. ఇందులో నాతో పాటు పలువురు రైతులకు చెందిన వ్యవసాయ భూములు పోయాయి. మిగితావారితో పోలిస్తే నా పొలం.. అర ఎకరం మేర అదనంగా కోల్పోయా. ఈ విషయాన్ని అప్పట్లో ఎమ్మెల్యే ఆనంద్‌ దృష్టికి తీసుకెళ్లా. నాకు న్యాయం చేయాలని అభ్యరి్థంచా. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన పరిహారం అందేలా చూస్తానని అప్పట్లో మాటిచ్చారు. కానీ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత వెళ్లి అడిగితే పట్టించుకోలేదు. చదవండి: ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్‌


రోడ్డులో తన భూమి పోయిందని పత్రాలు చూపిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి

దీంతో శుక్రవారం నేను వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లా. ఇచ్చిన మాట ప్రకారం తనకు పరిహారం అందేలా చూడమని అడిగా. అయితే తనను నేను సతాయిస్తున్నానని ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్‌ చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నన్ను జీప్‌లో ఎక్కించుకుని పీఎస్‌కు తీసుకెళ్లారు. నియోజకవర్గ పౌరుడిగా ఎమ్మెల్యే వద్దకు వచ్చి న్యాయం చేయమని అడగటం నేరమా..? ఇలా పోలీసులకు పట్టించడం, బెదిరించడం దారుణం. నన్ను పీఎస్‌కు తీసుకెళ్లిన పోలీసులు ఆతర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. ముందుగా ఇచి్చన మాట ప్రకారం నాకు న్యాయం చేయాలి’. అని బాధితుడు మీడియా ఎదుట వాపోయాడు. ఈ విషయమై వివరణ కోరేందుకు ఎమ్మెల్యేకు ఫోన్‌ చేయగా ఆయన స్పందించలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top