మేం పాన్‌ ఇండియాకు వెళ్తున్నాం.. మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Minister KTR Launched The Book Katha Rachana at Hyderabad | Sakshi
Sakshi News home page

మేం పాన్‌ ఇండియాకు వెళ్తున్నాం.. మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Jan 9 2023 9:00 PM | Updated on Jan 9 2023 9:02 PM

Minister KTR Launched The Book Katha Rachana at Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంటెంట్‌ ఉన్న సినిమాలు దేశమంతా ఆడుతున్నప్పుడు కంటెంట్‌ ఉన్న నాయకుడు ఎందుకు హిట్‌ కాలేడంటూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు దశరథ్‌ రాసిన కథారచన పుస్తకావిష్కరణ సోమవారం ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌ ముఖ్యఅతిధిగా హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు.

తనకు సినిమాతో పాటు క్రియేటివ్‌ కంటెంట్‌ అంటే కేటీఆర్‌ ఇష్టమన్నారు. ప్రతి రోజూ 11 నుంచి 12 పేపర్లు చదువుతానని చెప్పారు. కరోనా టైంలో కేసీఆర్‌ మాట్లాడేటపుడు అందరూ టీవీలకు అతుక్కుపోయేవారని అన్నారు. అంతర్జాతీయ సినిమాకు హైదరాబాద్‌ వేదికగా మారాలని ఆకాంక్షించారు.

ప్రస్తుతం దేశంలో తెలుగు సినిమాల హవా నడుస్తోంది. మేం కూడా పాన్‌ ఇండియాకు వెళ్తున్నాం. కంటెంట్‌ ఉన్న సినిమా దేశమంతా ఆడుతోంది. అలాంటిది కంటెంట్‌ ఉన్న తెలుగు నాయకుడు పాన్‌ ఇండియాకు వెళ్లలేరా?. కంటెంట్‌ ఉంటే ఎవరైనా పాన్‌ ఇండియా లీడర్‌ అవుతారని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement