మలక్‌పేటలో మళ్లీ మజ్లిస్‌ ? | Sakshi
Sakshi News home page

మలక్‌పేటలో మళ్లీ మజ్లిస్‌ ?

Published Fri, Dec 1 2023 8:29 AM

mim party wining hopes malakpet constituency - Sakshi

దిల్‌సుఖ్‌నగర్‌/చంచల్‌గూడ: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాతంగా  ముగిశాయి. మలక్‌పేట నియోజకవర్గంలో ప్రధాన  పార్టీలు రణరంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్యలో నెలకొంది. గత మూడు పర్యాయాల నుంచి ఎంఐఎం సిట్టింగ్‌ సీటు కావడంతో ఈసారి కూడా అభ్యర్థి అహ్మద్‌ బలాలా నాలుగోసారి విజయం నమోదు చేస్తానని గట్టి నమ్మకంతో ఉన్నాడు. మైనార్టీ ఓట్లు, అభివృద్ధి, హిందువుల ఓట్లపై నమ్మకం పెట్టుకున్న బలాలా మెజార్టీ పెంచుకోవడంపై దృష్టి సారించాడు. బీజేపీ అభ్యర్థి ప్రాంతానికి చెందిన పలు కుల సంఘాలు ఎంఐఎం అభ్యర్థికి మద్దతు పలకడం గమనర్హం.

బీజేపీ మేకపోతు గాంభీర్యం... 
ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఈసారి ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయామని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. గెలుస్తామనే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ రెండో స్థానం వచ్చినా పర్వాలేదని క్యాడర్‌ ఆశిస్తోంది.  బీజేపీ సీటుకై ప్రస్తుత అభ్యరి్థతో పాటు సైదాబాద్‌ కార్పొరేటర్‌ భర్త కొత్తకాపు రవీందర్‌రెడ్డి సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి ఎన్నికల ప్రచారం సాధనాలను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆఖరి నిమిషంలో సీటు సంరెడ్డి సురేందర్‌రెడ్డిని వరించడంతో రవీందర్‌రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యాడు.

 ఎన్నికల మెనేజ్‌మెంట్‌లో దిట్ట అయిన రవీందర్‌రెడ్డికి సీటు ఇస్తే ఎంఐఎం ఎమ్మెల్యే సీటుకు గురి పెట్టడం ఖా యమని బీజేపీ క్యాడర్‌లో గట్టిగా ఉండే. ఒక వేళ రవీందర్‌రెడ్డికి సీటు కేటాయిస్తే ఇబ్బంది కలగవచ్చని సిట్టింగ్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలా సైతం తర్జనభర్జన పడ్డాడు.  మలక్‌పేటలో చాలా మంది సీనియర్‌ నేతల తో పా టు ఇద్దరు సిట్టింగ్‌ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ ఎవరికీ ఎన్నికల కీలక బాధ్యతలు అప్పగించకుండా అభ్యర్థి అన్నీ తానై వ్యవహరించడం తో  బీజేపీ క్యాడర్‌ గందరగోళానికి గురైంది. 

మైనార్టీ ఓట్లు గెలిపిస్తాయని కాంగ్రెస్‌..
ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే రియల్టర్‌ వ్యాపారి షేక్‌ అక్బర్‌ కూడా మైనార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకున్నాడు. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ఓట్లతో పాటు కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుతో గట్టెకొచ్చని ధృడ నమ్మకంతో ఉన్నాడు. ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ మధ్య స్నేహపూర్వక పోటీ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి తనకు విజయం సాధించి పెడతాయని గులాబీ పార్టీ అభ్యర్థి తీగల అజిత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.  డిసెంబర్‌ 3వ తేదీన విజయం ఎవరిని వరిస్తుందో వేసి చూద్దాం.

Advertisement
 
Advertisement