
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఆర్చిగేట్ దగ్గర ఆదిముక్తీశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డుపై అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున నల్లకోడి, గుమ్మడికాయ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, మద్యం ఆనవాళ్లు శ్రామికులకు కనిపించాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
అయితే.. మూఢనమ్మకాలు, క్షుద్రపూజలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. అయినప్పటికీ.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.