పెంపుడు పిల్లి కోసం ప్రాణం తీసుకుంది | MBBS student ends life | Sakshi
Sakshi News home page

పెంపుడు పిల్లి కోసం ప్రాణం తీసుకుంది

Mar 21 2026 5:14 AM | Updated on Mar 21 2026 5:14 AM

MBBS student ends life

ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య 

అల్వాల్‌: పెంపుడు పిల్లి విషయమై ఇంట్లో వాగ్వాదం జరిగి ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. రిసాలా బజార్‌ పరిధిలోని శివ్‌మన్‌ ప్రైడ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న అముదల కుసుమలత కుమార్తె ప్రిన్సీ శ్రేష్ట (23) ఎంబీబీఎస్‌ చదువుతోంది.

కాగా ఇంట్లో పెంపుడు పిల్లి విషయమై తల్లి, కుమార్తెల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రేష్ట చున్నీతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందింది. ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచా రం అందించగా.. శ్రేష్ట అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.  అల్వాల్‌ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement