కాసుల కోసం కన్న కొడుకునే అమ్మిన తండ్రి.. తల్లి చొరవతో..!

Man Sold His Sun Due to Econamical Crisis - Sakshi

నాన్న.. కుటుంబమనే టీంకు నాయకుడు. ఇంట్లో అందరి బాధ్యతలను ముందుండి చూసుకుంటాడు. అందుకు ఎంత కష్టమైన ఇష్టంగా భరిస్తాడు. తను ఉండగా.. పిల్లలకు ఏ ఆర్థిక ఇబ్బందులు రాకుండా సమాజంలో పోరాడతాడు. ఇంట్లో నాన్న ఉంటే కుటుంబ సభ్యులకు ఉండే ధైర్యమే వేరు. అలాంటిది.. నాన్నే డబ్బుల కోసం పిల్లలను అమ్మేస్తే.. ! ఇలాంటి అమానవీయ ఘటనే వరంగల్ జిల్లాలో జరిగింది. 

జిల్లాలో షేక్ మసూద్ అనే వ్యక్తి తన భార్యతో నివసిస్తున్నాడు. వారికి నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇటీవల వారిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. డబ్బుల కోసం షేక్ మసూద్.. ముగ్గురు మహిళల సహాయంతో  తన కుమారుడిని హైదరాబాద్ కు చెందిన దంపతులకు విక్రయించాడు. విషయం తెలుసుకున్న భార్య పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. నాలుగు రోజుల‍్లోనే కేసును ఛేదించారు.

ఆ ముఠా దగ్గర నుంచి బాలుడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తండ్రి మసూద్‍తో పాటు ఇందుకు సహకరించిన శాకరాసికుంట, రాయపుర, కేఎల్ మహేంద్రనగర్, కీర్తినగర్ చెందిన ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఓ సినిమా థియేటర్‌కు వాచ్మెన్‌గా పనిచేసే ఓ వ్యక్తి కూడా ఇందులో పాలుపంచుకున్నారని తెలిపారు. బాలున్ని అయాన్ గా గుర్తించి, తల్లి చెంతకు చేర్చారు. 

చదవండి:సంసారానికి పనికిరాని భర్త.. డబ్బుల కోసం మరో పెళ్లి.. ఫోటోలు మార్పింగ్‌ చేసి..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top