ప్రేయసి రావే | Man Climbs Tower in Anger Over Girlfriend at Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేయసి రావే

Apr 23 2026 9:14 AM | Updated on Apr 23 2026 9:23 AM

Man Climbs Tower in Anger Over Girlfriend at Hyderabad

హైదరాబాద్‌:   పెట్రోల్‌ క్యాన్‌తో హైటెన్షన్‌ టవర్‌  ఎక్కిన ఓ యువకుడు తన ప్రేయసితో మాట్లాడించాలని.. లేకపోతే పెట్రోల్‌ పోసుకుని దూకుతానని పోలీసులకు బెదిరించాడు.  ఇలా దాదాపు మూడు గంటల పాటు మండుటెండలో ముచ్చెమటలు పట్టించాడు.  అల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన సా ల్మాన్‌ రాజ్‌కు  ఎస్‌ఆర్‌టీనగర్‌కు చెందిన యువతితో పరిచయమైంది. ఈ క్రమంలో ఇటీవల సాల్మన్‌రాజ్‌ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది.

 ఆ తరువాత ఆమెకు దగ్గరకావాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో బుధవారం పెట్రోల్‌ క్యాన్‌తో మోతీనగర్‌ పార్కులో ఉన్న హైటెన్షన్‌ టవర్‌ను ఎక్కాడు.  సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు సురేందర్‌తో మాట్లాడాడు. యువతితో మాట్లాడించాలని యువకుడు కోరాడు.  అయితే ఆతరువాత బోరబండ ఎస్‌హెచ్‌ఓ సురేందర్‌ మాటల్లోకి దించి దిగివచ్చేలా చేశాడు. అనంతరం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement