TS Mahalakshmi Scheme Guidelines: రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.. గైడ్‌లైన్స్‌ విడుదల

Mahalakshmi Scheme Guidelines Released By Telangana Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాలక్ష్మీ పథకం గైడ్‌లైన్స్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఓఎంసీ సంస్థలకు సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం.. సంస్థల నుంచి డీబీటీ ద్వారా వినియోగదారులకు నగదు చెల్లించనుంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం మానిటరింగ్ చేయనుంది.

కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో మరో హామీని అమలు చేసేందుకు జీవో జారీ చేసింది. రేషన్‌కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తెల్లరేషన్‌కార్డు దారులకే రూ.500కే సిలిండర్‌ ఇవ్వనున్నట్లు పేర్కొంది. గ్యాస్‌ కంపెనీలకు నెలవారీగా సబ్సిడీ చెల్లిస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top