శ్రీచైతన్య కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య | Madhapur Sri Chaitanya Junior College Student Pooja Reddy Ends Her Life, Parents Allege Academic Pressure | Sakshi
Sakshi News home page

శ్రీచైతన్య కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య

May 13 2026 3:27 PM | Updated on May 13 2026 4:19 PM

Madhapur Sri Chaitanya Junior College Student Pooja Reddy Incident

సాక్షి, హైదరాబాద్‌: శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ విద్యార్థిని పూజారెడ్డి ఆత్మహత్యకు పాల్పడింది. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని సరస్వతి హాస్టల్‌లో ఘటన జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన పూజారెడ్డి ఇంటర్‌ ఫస్టియర్‌ పూర్తి చేసింది. సప్లమెంటరీ పరీక్షల కోసం యాజమాన్యం ఒత్తిడి చేసినట్టు సమాచారం.

విద్యార్థిని ఆత్మహత్యపై తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీచైతన్య కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కాలేజీ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజీ  యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement