సంజయ్‌పై దాడి సంగతేంటి?

Lok Sabha Privileges Committee summons Telangana Chief Secretary DGP - Sakshi

రాష్ట్ర సీఎస్, డీజీపీ, కరీంనగర్‌ సీపీలకు లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ సమన్లు

వచ్చే నెల 3న కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ఉద్యోగుల సమస్య లపై దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను కార్యాలయంలోకి వెళ్లి అరెస్టు చేసిన అంశంలో రాష్ట్ర సీఎస్, డీజీపీ, కరీంనగర్‌ సీపీ, ఇతర పోలీసు అధికారులకు లోక్‌సభ ప్రివి లేజ్‌ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈ అంశంలో బండి సంజయ్‌ ఫిర్యాదు మేరకు కమిటీ విచారణ చేపట్టింది. దాడి, అరెస్టు ఘటనకు సంబంధించి ఇప్పటికే సంజయ్‌ వాదనలు విని.. ఆయన సమ ర్పించిన ఆధారాలను, వీడియో క్లిప్పింగులను పరిశీలించింది. తర్వాత కొద్దిగంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సమన్లు్ల జారీ అయ్యాయి.

ఫిబ్రవరి 3న ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరు కావాలని కమిటీ చైర్మన్‌ సునీల్‌ కుమార్‌ శని వారం ఆదేశించారు. సమన్లు జారీ అయిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ గుప్తా, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ, హుజూరా బాద్‌ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, జమ్మికుంట ఇన్‌ స్పెక్టర్‌ కొమ్మినేని రాంచందర్‌రావు, హుజూరా బాద్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాస్, కరీంనగర్‌ సీసీఎస్‌ ఏసీపీ కె.శ్రీనివాసరావు, కరీంనగర్‌ టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ చలమల్ల నరేశ్‌ ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top