జీహెచ్‌ఎంసీ: బీజేపీ కార్పొరేటర్‌ మృతి | Lingojiguda BJP Corporator Ramesh Goud Passed Away Due To Corona | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ: బీజేపీ కార్పొరేటర్‌ మృతి

Dec 31 2020 7:19 PM | Updated on Dec 31 2020 7:45 PM

Lingojiguda BJP Corporator Ramesh Goud Passed Away Due To Corona - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  లింగోజీగూడ బీజేపీ కార్పొరేటర్‌ రమేశ్‌ గౌడ్‌ గురువారం మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం​ కరోనా బారిన పడిన ఆయన.. ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఇటీవలే జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన రమేశ్‌ గౌడ్‌ లింగోజీగూడ నుంచి కార్పొరేట్‌ర్‌గా ఎన్నికయ్యారు. కాగా వారం రోజుల క్రితం రమేశ్‌ గౌడ్‌కు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో రమేశ్‌ గౌడ్‌ ప్రాణాలు కోల్పోయారు. గతంలో రమేశ్‌ గౌడ్‌ ఎల్బీ నగర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement