ఎమ్మెల్యే చిరుమర్తికి మంత్రి కేటీఆర్‌ ఫోన్‌..!

KTR Talks To MLA Chirumarthi Lingaiah Over Phone Covid Situation - Sakshi

నకిరేకల్‌లో కరోనా పరిస్థితులపై ఆరా

బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచన

నకిరేకల్‌ : నియోజకవర్గంలో కరోనా వైరస్‌ విజృంభణపై రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఆరా తీశారు. ఆదివారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఫోన్‌ చేసి కరోనా పరిస్థితులు, మహమ్మారి నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ ఏ విధంగా సాగుతోందని అడిగి తెలుసుకున్నారు. బాధితుల్లో మనోధైర్యాన్ని నింపాలని, మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు సమకూర్చుతామని తెలిపారు. 

కరోనా  బాధితులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే
కరోనా బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భరోసా ఇచ్చారు. నకిరేకల్‌ మున్సిపాలిటిలోని 1,2,5,6,17,20 వార్డులలో ఆదివారం ఆయన పర్యటించారు. కరోనా బారిన పడి మృతి చెందిన 15 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.1.50లక్షల ఆర్థిక సాయాన్ని ఆయన అందజేశారు. కరోనా వచ్చిందని అధైర్యపడకుండా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.

అదే విధంగా అన్ని పీహెచ్‌సీలలో కరోనా టెస్టులు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు కందాల భిక్షం రెడ్డి, రాచకొండ సునీల్‌గౌడ్, పల్లేవిజయ్, చెవుగోని రాములమ్మ ఉన్నారు.

చదవండి: Corona: పిల్లల్లో కోవిడ్‌ లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి? 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top