KTR: ఎక్కడున్నారో చెప్పుకోండి చూద్దాం..!

KTR Shares His School Memory Can U Identify Where is He In This Photo - Sakshi

చిన్నప్పటి ఫొటో షేర్‌ చేసిన కేటీఆర్‌..

సాక్షి, హైదరాబాద్‌: ‘భరత్‌ అని నాతో పాటు నాలుగో తరగతి చదువుకున్న మిత్రుడు నిన్న ఈ ఫోటో నాకు పంపించాడు. కరీంనగర్‌ సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్లో నాలుగో తరగతి చదివేనాటిది ఇది. కొంత విడ్డూరమే అయినా ఒకటి మాత్రం నిజం. ఈ ఫొటోలో ఉన్న ప్రతీ ఒక్కరి పేరును జ్ఞప్తికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా’ అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదికగా ఆదివారం తన స్కూల్‌ రోజుల నాటి ఫొటోను షేర్‌ చేశారు.

ఇంతకీ ఇందులో కేటీఆర్‌ ఎక్కడున్నారు అనేదేగా మీ డౌట్‌. ఇదే అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేశారు. కేటీఆర్‌ అయితే.. సమాధానం చెప్పలేదు. అయితే, పైన నిల్చున్నవారిలో ఎడమ నుంచి ఉన్న రెండో బాలుడే కేటీఆర్‌ అని చాలామంది కామెంట్లు పెట్టారు.

చదవండి: KTR: క్యాప్‌ బాగుంది.. ఫొటో దిగుదామా అమ్మా!

ఐటీ కారిడార్‌లో 4 కొత్త లింకు రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top