
సాక్షి, నల్లగొండ: నేడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి. ఆయన వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల.. మహానేతకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు కూడా ఆయనకు నివాళులు అర్పించారు. మహానేతను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ తన మనసులో ఆయనకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విట్టర్ వేదికగా.. ‘‘అన్నలా మీరిచ్చిన భరోసా.. ‘వెంకన్నా’ అంటూ పిలిచిన ఆ పిలుపులోని ఆప్యాయత.. ఎప్పటికీ శాశ్వతం రాజన్న! జన హృదయ నేతకు నివాళులు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఆ హస్తం.. పేదల ఆకలి తీర్చే భరోసా
ఆ హస్తం.. కూలుతున్న గుడిసెకు భరోసా
ఆ హస్తం.. సరస్వతీ పుత్రులకు ఫీజు రియంబర్సుమెంటు ప్రోత్సాహం
ఆ హస్తం.. కుటిల రాజకీయాలకు పాశుపతాస్త్రం
పేదల చిరునవ్వుల్లో చిరంజీవిగా నిలిచిన జన హృదయ నేతకు ఇదే నా నివాళులు అంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
అన్నలా మీరిచ్చిన భరోసా..
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) September 2, 2022
‘వెంకన్నా ‘ అంటూ పిలిచిన ఆ పిలుపులోని ఆప్యాయత..
ఎప్పటికీ శాశ్వతం రాజన్న!
జన హృదయ నేతకు నివాళులు 🙏🏻💐#YSRVardanthi pic.twitter.com/JAE3GxawzW
ఇది కూడా చదవండి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి