మునుగోడు: ఈటల అత్తగారి గ్రామంలో బీజేపీకి బూస్ట్‌.. దెబ్బకొట్టిన ఆ రెండు గుర్తులు!

Key Votes For BJP In Palivela Village Of Munugodu - Sakshi

సాక్షి, మునుగోడు: తెలంగాణలోని మునుగోడు ఉప ఎ‍న్నికల పూర్తి స్థాయి ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. ఇప్పటి వరకు 11వ రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. 11వ రౌండ్‌ వరకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధిక్యంలో కొనసాగింది. 

ఇక, మునుగోడు నియోజకవర్గంలోని ఈటల రాజేందర్‌ అత్తగారి గ్రామమైన పలివేల గ్రామంలో బీజీపీ.. టీఆర్‌ఎస్‌ పార్టీపై 207 ఓట్ల లీడ్‌ సాధించింది. ఇక, ఈ గ్రామానికి టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఇంఛార్జ్‌గా వ్యవహరించారు. 

ఇదిలా ఉండగా.. మునుగోడు ఓట్ల లెక్కింపులో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు తమ సత్తా చాటారు. ముఖ్యమైన పార్టీలకు భారీ షాకిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో ఈవీఎంలలో కారు మాదిరిగా ఉన్న చపాతీ రోలర్, రోడ్డు రోలర్ గుర్తులకు భారీగా ఓట్లు పడ్డాయి. ఏడో రౌండ్ ముగిసే వరకు చపాతీ రోలర్‌కు 994, రోడ్డు రోలర్ గుర్తుకు 746 ఓట్లు పోలయ్యాయి. కాగా, ఇండిపెండెంట్‌ అభ్యర్థుల గుర్తుల కారణంగా పార్టీలకు కొంత ఎదురుదెబ్బ తగిలింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top