తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్‌ రావు క్వాష్ పిటిషన్లు | KCR and Harish Rao File Quash Petition in High Court | Sakshi
Sakshi News home page

తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్‌ రావు క్వాష్ పిటిషన్లు

Dec 23 2024 8:53 PM | Updated on Dec 23 2024 8:53 PM

KCR and Harish Rao File Quash Petition in High Court

సాక్షి,హైదరాబాద్‌ : మాజీ సీఎం కేసీఆర్‌,మాజీ మంత్రి హరీష్‌ రావులు తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు పంపిన నోటీసుల్ని కొట్టివేయాలని కోరారు.

మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలైంది. విచారణ చేపట్టిన కోర్టు ఈ ఏడాది జులై 10న కేసీఆర్‌, హరీశ్‌రావుకు నోటీసులు పంపింది. అయితే, ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో కేసీఆర్‌, హరీష్‌రావు తాజాగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement