కాప్రా చెరువును పరిశీలిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
పర్యావరణ పరిరక్షణకే అని వెల్లడి
హైదరాబాద్: జీవ వైవిధ్యానికి ప్రతీకగా, నగర పర్యావరణ సమతుల్యతకు కీలకమైన వెట్‌ల్యాండ్‌గా గుర్తింపు పొందిన కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనాలకు వెసులుబాటు లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన కాప్రా చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు.
అనంతరం భాగ్యనగర్ ఉత్సవ సమితి స్థానిక ప్రతినిధులతో మాట్లాడి పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా గణనాథుల నిమజ్జనాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కాప్రా చెరువు అర్బన్ వెట్‌ల్యాండ్ జాబితాలో ఉందని, ఇక్కడి జీవవైవిధ్యం, పక్షల ఆవాసాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.
ఆ్రస్టేలియా, యూరప్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి 470కిపైగా వలస పక్షులు ఇక్కడికి వస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాప్రా లేక్ రివైవల్ గ్రూప్ ప్రతినిధులు హైడ్రా కమిషనర్‌ను కలిసి చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, హైడ్రా ఏసీపీ ఉమా మహేశ్వర్‌రావు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు


