breaking news
kapra lake
-
Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..
-
కాప్రా చెరువులో నిమజ్జనాలు వద్దు
హైదరాబాద్: జీవ వైవిధ్యానికి ప్రతీకగా, నగర పర్యావరణ సమతుల్యతకు కీలకమైన వెట్‌ల్యాండ్‌గా గుర్తింపు పొందిన కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనాలకు వెసులుబాటు లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన కాప్రా చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు.అనంతరం భాగ్యనగర్ ఉత్సవ సమితి స్థానిక ప్రతినిధులతో మాట్లాడి పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా గణనాథుల నిమజ్జనాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కాప్రా చెరువు అర్బన్ వెట్‌ల్యాండ్ జాబితాలో ఉందని, ఇక్కడి జీవవైవిధ్యం, పక్షల ఆవాసాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.ఆ్రస్టేలియా, యూరప్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి 470కిపైగా వలస పక్షులు ఇక్కడికి వస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాప్రా లేక్ రివైవల్ గ్రూప్ ప్రతినిధులు హైడ్రా కమిషనర్‌ను కలిసి చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, హైడ్రా ఏసీపీ ఉమా మహేశ్వర్‌రావు పాల్గొన్నారు.ఇవి కూడా చదవండి: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు -
చెరువులో శవమై తేలిన గుజరాత్ యువకుడు
హైదరాబాద్: బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఓ యువకుడు కాప్రా చెరువులో పడి మృతిచెందిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన రాజేశ్ (22) కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బీజేఆర్ నగర్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో గరం మసాలాలు అమ్ముకుంటు జీవనం సాగిస్తున్నాడు. గతనెల 30న కాప్రా చెరువులో స్నానం కోసం వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం కాప్రా చెరువులో ఓ యువకుడి శవం తేలియాడడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు నీటిపై తేలాడుతున్న శవాన్ని వెలికితీశారు. దాదాపుగా వారం రోజులు అవుతుండటంతో శవం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. గట్టుపై దొరికిన దుస్తుల ఆధారంగా రాజేశ్‌గా గుర్తించిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ ఎన్.వెంకటరమణ తెలిపారు.


