చెరువులో శవమై తేలిన గుజరాత్ యువకుడు | gujarath person deadbody found in kapra lake | Sakshi
Sakshi News home page

చెరువులో శవమై తేలిన గుజరాత్ యువకుడు

Feb 4 2015 5:15 PM | Updated on Sep 2 2017 8:47 PM

బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఓ యువకుడు కాప్రా చెరువులో పడి మృతిచెందిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది.

హైదరాబాద్: బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఓ యువకుడు కాప్రా చెరువులో పడి మృతిచెందిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన రాజేశ్ (22) కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బీజేఆర్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో గరం మసాలాలు అమ్ముకుంటు జీవనం సాగిస్తున్నాడు. గతనెల 30న కాప్రా చెరువులో స్నానం కోసం వెళ్లి తిరిగి రాలేదు.
బుధవారం కాప్రా చెరువులో ఓ యువకుడి శవం తేలియాడడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు నీటిపై తేలాడుతున్న శవాన్ని వెలికితీశారు. దాదాపుగా వారం రోజులు అవుతుండటంతో శవం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. గట్టుపై దొరికిన దుస్తుల ఆధారంగా రాజేశ్‌గా గుర్తించిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ ఎన్.వెంకటరమణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement